ఇరాన్‌, ఇరాక్‌, అమెరికాల్లో పరిణామాలు మూడో ప్రపంచ యుద్దానికి సంకేతాల ?

0
20

పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న సులేమానీ ఖననం పూర్తైన తర్వాత నుంచి ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకొనేందుకు అడుగులు వేస్తోంది. మరోపక్క అమెరికా ఏమాత్రం తగ్గడంలేదు. అగ్రదేశం అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి పదునుపెడుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఇరాన్‌, ఇరాక్‌, అమెరికాల్లో పరిణామాలు నాటకీయంగా మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ భయాలకు ఆజ్యం పోసేట్లు బుధవారం తాజా ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఒక పౌరవిమానం కూలిపోవడం.. అణుకేంద్రం వద్ద భూప్రకంపనలు.. అంతకుముందు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల ప్రత్యక్ష దాడులతో యుద్ధం ఖాయమనే భయం సర్వత్రా నెలకొంది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో సంకీర్ణ సేనల సిబ్బంది మృతిచెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఐఆర్‌జీసీ ప్రోత్సాహక ముఠాలే అమెరికాపై దాడి చేశాయి.. ఇప్పుడు ఇరాన్‌ అధికారిక బలగమైన ఐఆర్‌జీసీ దాడి చేయడం అంటే ప్రత్యక్షంగా తలపడటమే.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన తురుపు ముక్క ఎఫ్‌-35 స్టెల్త్‌ జెట్‌ విమానాలను బయటకు తీసింది. ఉటలోని హిల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్థావరంలో ఉన్న 388వ, 419వ ఫైటర్‌ వింగ్స్‌ భారీగా యుద్ధ సన్నద్ధత విన్యాసాలు చేశాయి. ఈ క్రమంలో భాగంగా దాదాపు 52 ఎఫ్‌-35ఏ విమానాలు ‘ఎలిఫెంట్‌ వాక్‌’ను నిర్వహించాయి. ఒకే రన్‌వే పై నుంచి చాలా యుద్ధవిమనాలు తక్కువ దూరంతో టేకాఫ్‌ అయ్యేలా దీనిని నిర్వహిస్తారు. పూర్తిస్థాయి యుద్ధం వస్తే ఎలా స్పందించాలనే అంశంలో భాగంగా దీన్ని చేపట్టారు. ఇరాన్‌తో ఉద్రిక్తల సమయంలో ఇన్ని యుద్ధవిమనాలు రన్‌వేపైకి రావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here