భరత్, అమెరికా ప్రమాదం లో ఉందా?

0
29

ప్రపంచ రాజకీయ పరిస్థితులపై అమెరికాలోని ఓ కన్సల్టెన్సీ అధ్యయనం చేసింది. 2020 సంవత్సరంలో భారత్‌ రాజకీయంగా ప్రమాదకర దేశాల జాబితాలో కొనసాగనుందని తెలిపింది. సదరు అధ్యయనం ప్రకారం.. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారాన్ని చేపట్టాక ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని పేర్కొంది. ఇక రాజకీయంగా ప్రమాదకర పరిస్థితులున్న దేశాల జాబితాలో అమెరికా ముందు వరుసలో ఉంది. ఎన్నికల సమయం నుంచే అమెరికా అనేక సంచలనాలకు వేదికయ్యింది. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం, మరెన్నో సంఘటనలు అమెరికా చరిత్రలో చోటు చేసుకున్నాయని తెలిపింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో అమెరికా, చైనా పోటీ ధోరణి.. విలువలు, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డాయి.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here