భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్

0
17

అమెరికాలోని భారతీయులకు ట్రంప్ సర్కార్ వల్ల ఏదొక సమస్య వచ్చి పడుతోంది. మొన్నటికి మొన్న హెచ్1బీ వీసాతో కష్టాలు వస్తే.. ఇప్పుడు తాజాగా మరో వీసా సమస్య ఇండియన్స్‌కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టేలా ఉంది. హెచ్1బీ వీసాపై పని చేస్తున్న విదేశీయులు.. వారి జీవితభాగస్వాములకు, పిల్లలకు పని చేసే అనుమతి కల్పించడానికి తీసుకునేది హెచ్4 వీసా. దీనితో ఎక్కువగా లబ్ది పొందేది కూడా భారతీయులే. అయితే ఇప్పుడు ఆ వీసాపై యూఎస్ ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టడంతో మనవాళ్లకు గట్టి షాక్ తగిలింది. దీంతో చేసేదేమి లేక వారు కోర్టును ఆశ్రయించారు.

2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్ 4 వీసా విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసా కలిగి.. గ్రీన్ కార్డు కోసం ఎవరైతే విదేశీయులు వేచి చూస్తున్నారో వారి జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఈ వీసాను మంజూరు చేస్తారు. దీంతో వారికి అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అనుమతులు లభిస్తాయి. ఈ వీసా ద్వారా ఇండియన్స్‌కే ఎక్కువ లబ్ది చేకూరుతుంది. అయితే ఇప్పుడు పిల్లల వయసు విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. 21 ఏళ్ళు దాటి చదువుతున్న పిల్లలు ఇకపై ఎఫ్‌1 వీసాను తీసుకోవాల్సి ఉంటుందట. దీంతో మనవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అమెరికా చట్టాల ప్రకారం ఎఫ్1 వీసా కోటాలో భాగంగా అక్కడి ప్రభుత్వం ఈ వీసాలను ఇండియన్స్‌కు తక్కువగా జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్4 వీసా కింద చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసేవారు నూతన కేటగిరీలో వీసాలు పొందటం కష్టతరంగా మారింద. దీని వల్ల ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారుతుందని.. తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here