ఆర్ ఆర్ ఆర్ లో హైలైట్ సిన్స్

0
18

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి తీస్తున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలతో పాటు బాహుబలి అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే డెభ్బై ఐదు శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ , మళయాలం, హిందీతో పాటు మరో ఐదు భాషల్లో విడుదల అవనుంది. విశాఖ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం మరో షెడ్యూల్ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కి జోడోగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకి వచ్చింది. ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో ప్రత్యర్థుల పై చేసే మొదటి ఫైట్ సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వస్తాయని.. అడవిలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాల బాగా వస్తోందని.. సినిమా మొత్తంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తుంది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here