16వ శతాబ్దంలోనే ప్రపంచ పటంలో “నాటి రవ్వల కోట”

0
27

విజయనగర సామ్రాజ్య ఘనత గురించి ప్రస్తావన వస్తే ఆనాటి ఆలయాల నిర్మాణాలు, శత్రుదుర్భేద్య కోటలు, రక్షణ గోడలు, రాయల పరిపాలనతో పాటు అప్పట్లో విశాలమైన వీధుల్లో ముత్యాలు, కెంపులు, నీలాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించిన వైనాన్ని చెప్పుకోవాల్సిందే. ఆ వీధుల్లో అమ్మిన వజ్రాలు ఎక్కువగా ఎక్కడి నుంచి తెచ్చారని తెలుసుకోవాలని ఉందా.. అయితే నాటి రవ్వల కోట వజ్ర వైభవాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందే. 16వ శతాబ్దంలోనే ప్రపంచ వజ్ర నిక్షేప పటంలో స్థానం సంపాదించుకున్న నేటి రామళ్లకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాజులు, నవాబులు, బ్రిటీషు వారి కాలంలో పాలనా కేంద్రంగా విరాజిల్లిన ఈ గ్రామం ఎన్నో విశేషాలకు నిలయంగా నిలిచింది. పూర్వం కృష్ణా, తుంగభద్ర నదీ పరీవాహక, సంగమ ప్రాంతాల్లోని దక్షిణ భాగం దాదాపు 300కి.మీ.ల వరకు అపార వజ్ర నిక్షేపాలుండేవి. వాటిలో గుంటూరు జిల్లా కొల్లూరుతోపాటు, వివిధ జిల్లాల్లోని పరిటాల, గొల్లపల్లి, మాలవల్లి, బెల్లంకొండ, బనగానపల్లె, రామళ్లకోట, వజ్రకరూర్, జొన్నగిరి ప్రాంతాలు ప్రసిద్ధి.

నాటి రవ్వల కోట.. నేటి రామళ్ల కోట

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here