మళయాలీల కోసం బన్నీ సినిమా

0
29

బన్నీ కి మళయాలంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక తెలుగు హీరోకి మళయాలంలో ఇంతటి క్రేజ్ రావడం నిజంగా ఆశ్చర్యమే. తెలుగుతో సమానంగా మళయాలంలో అభిమానులని సంపాదించుకోవడం చిన్న విషయమేమీ కాదు. బన్నీ కేరళ వెళ్ళినప్పుడల్లా ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ అభిమానుల కోసం బన్నీ మళయాలంలో డైరెక్ట్ గా సినిమా చేసే పనిలో ఉన్నాడట.మలయాళంలో సినిమా చేయడం కోసం సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు బన్నీ వెల్లడించాడు. అక్కడ సినిమా చేయడంపై తాను చాలా సీరియస్‌గా ఉన్నానని.. ఇప్పటికే అక్కడి దర్శకులు తనకు కొన్ని కథలు కూడా చెప్పారని.. కానీ అవి నచ్చక ఊరుకున్నానని బన్నీ తెలిపాడు. మరి కొద్ది రోజుల్లో తనకి సరిపడా స్క్రిప్టు దొరికితే ఖచ్చితంగా మళయాలీ అభిమానుల కోసం సినిమా చేస్తానని అంటున్నాడు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here