కేంద్రానికి నితీష్‌ కుమార్‌ షాక్‌

0
15

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చట్టంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని నితీష్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం పట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఏఏపై మరోసారి సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. సీఏఏపై ఈ విధంగా ప్రకటించిన తొలి ఎన్డీయే కూటమి పార్టీ జేడీయూ కావడం విశేషం. సీఏఏ పై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్‌ఆర్‌సీని బిహార్‌లో అమలు చేసే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నితీష్‌ ప్రకటనతో బీజేపీ నేతలు షాక్‌కి గురయ్యారు

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here