మైక్రోమ్యాక్స్ కేవలం రూ.3,999కే 3 జీబీ ర్యామ్

0
18

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త..! దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ కు చెందిన ఎవోక్ డ్యూయల్ నోట్ అనే స్మార్ట్ ఫోన్ అతి చవక ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకునే వారికి, ఇంట్లో పెద్దవారికి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనివ్వాలనుకునే వారికి ఇటువంటి ఫోన్లు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. వాస్తవానికి రూ.9,999 విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.3,999కే ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. అంటే ఈ ఫోన్ పై రూ.6,000 తగ్గింపు లభించింది.
ఫీచర్ల విషయానికి వస్తే.. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంది. ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. ముందు వైపు 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరా కూడా ఉంది. అలాగే 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ అమర్చబడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here