అధ్యాపకుల పీహెచ్‌డీలు, తప్పనిసరి, ఫ్యాకల్టీలకు ఆదేశాలు

0
18

అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఓడీలు, అధ్యాపకుల పీహెచ్‌డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను మరోసారి చూపించాలని జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ పీహెచ్‌డీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో అనేక కళాశాలల్లో హెచ్‌ఓడీలు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేవలం మూడు నెలల కాలంలోనే మరోసారి పరిశీలనకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఈ చర్య నకిలీ విద్యార్హతలతో కొనసాగుతున్న వారిలో వణకు పుట్టిస్తోంది. ఇదే విధంగా ఫిర్యాదులు రావడంతో గడిచిన అక్టోబర్‌ నెలలోనూ ఫ్యాకల్టీ పీహెచ్‌డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించింది. అయినప్పటికీ గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదులు వస్తుండటంతో మరోసారి పక్కాగా నిర్వహించేందుకు సిద్ధం అయింది. దీంట్లో భాగంగానే ఈ నెల 8న మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్యాకల్టీ సభ్యులు యూనివర్సిటీలోని అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌ వద్ద సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ ముందు స్వయంగా హాజరు కావాలని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ గోవర్దన్‌ అనుబంధ కళాశాలకు ఆదేశాలు జారీచేశారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here