రెండో టీ20 మ్యాచ్ – Updates

0
25

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక ఆదిలోనే తడబడింది. 4.5 ఓవర్లలో 38 జట్టు స్కోరు 38 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అవిష్క ఫెర్నాండో 16 బంతుల్లో 5 ఫోర్లు బాది 22 పరుగులకే చేతులేత్తేశాడు.

వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ కు క్యాచి ఇచ్చి అవిష్క పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 7.4 ఓవర్ల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గుణతిలక సైని బౌలింగ్‌లో నవదీప్ బౌల్డ్ చేయడంతో 20 పరుగులకే పరిమితమయ్యాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు బాదిన తిలక స్వల్ప స్కోరుకే రెండో వికెట్ రూపంలో నిష్ర్కమించాడు.

అనంతరం బరిలోకి దిగిన ఒషాడ ఫెర్నాండో 11.3 ఓవర్లలో (9 బంతుల్లో 1 ఫోర్) 10 పరుగులకే చేతులేత్తేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రిషబ్ పంత్ స్టంప్ ఔట్ చేయడంతో శ్రీలంక మూడో వికెట్ చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది.

వెనువెంటనే పెరీరా (34), రాజపక్స (9) పరుగులతో వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో శ్రీలంక 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక ఆటగాళ్లు డి సెల్వా (1), దాసన్ షణక (5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్ రెండో వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here