రాజధాని పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌

0
17

రాజధాని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌ అయింది. మహిళలపై లాఠీచార్జ్‌ ఘటనను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. 144 సెక్షన్ తొలగించాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రామాల్లో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్‌ చేయడమేంటని కోర్టు ప్రశ్నించింది. కర్ఫ్యూ వాతావరణం ఎందుకు ఉందని హైకోర్టు నిలదీసింది. మహిళలను బయటికి రానివ్వడం లేదని, దాడులు చేస్తున్నారని, శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదన్న పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాదు రాజధాని గ్రామాలను రక్షించాలని పిటిషనర్లు కోరారు. కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here