జయరాం హత్యకేసు : ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు

0
160
Jayaram Death
Killers Of Chigurupati Jayaram

ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డితో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మంగళవారం విలేరులతో మాట్లాడుతూ… నిందితుడు రాకేష్‌ రెడ్డి.. ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు. ఓ కేసు సందర్భంగా వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని.. ఆ క్రమంలోనే నిందితుడు.. మల్లారెడ్డితో సంబంధాలు పెంచుకున్నాడని తెలిపారు.
ఈ నేపథ్యంలో అంబర్‌పేట్‌ కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు మల్లారెడ్డిని అటాచ్‌ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ విషయమై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఇక ఇబ్రహీంపట్నం ఏసీపీగా వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here