ఖగేంద్ర మృతి – 2.4 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా గుర్తింపు

0
109

ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా పేరుపొందిన 27ఏళ్ల  ఖగేంద్ర థాప మగర్‌ నిన్న రాత్రి మరణించాడు. నేపాల్ కు చెందిన ఖగేంద్ర కేవలం 2.4 అడుగుల ఎత్తు మాత్రమే ఎదిగాడు. ఇతను గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖగేంద్రకు నిన్న రాత్రి తీవ్రంగా గుండెపోటు రావడంతో మరణించాడని సోదరుడు మహేష్‌ థాప మగర్‌ తెలిపాడు. 2010లో ఖగేంద్ర తన 18వ ఏట ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా గుర్తింపు పొంది ‘గిన్నిస్’ సర్టిఫికేట్‌ అందుకున్నాడు. అదే సంవత్సరం జరిగిన నేపాల్‌ భామల అందాల పోటీలో హల్‌చల్‌ చేసి విజేతలతో ఫొటోలకు పోజిచ్చాడు. ఖగేంద్ర నేపాల్ పర్యాటక శాఖకు అధికారిక ప్రచారకర్తగా పనిచేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here