మల్లి బంపర్ ఆఫర్‌. ప్రకటించిన వొడాఫోన్

0
123

టెలికాం సంస్థ వోడాఫోన్ వినయోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రూ.99, రూ.555 టారిఫ్ ప్లాన్లతో ఈ అన్ లిమిటెడ్ ఆఫర్లు లభిస్తున్నాయి. రూ.99 ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటుగా.. 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని ఇతర నెట్‌వర్క్స్(లోకల్, నేషనల్)కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ అందిస్తున్నారు. ఈ ప్లాన్‌ గడువు18 రోజులుగా ఉంది. దీంతో పాటుగా రూ.555 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు.. 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తుంది. అంతేకాకుండా.. 70 రోజుల గడువుతో అన్ని ఇతర నెట్‌వర్క్స్‌కు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను అందిస్తుంది. కాగా, ఈ రూ.99 ప్లాన్‌ ప్రస్తుతం కోల్‌కతా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, రాజస్థాన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. రూ.555 ప్లాన్‌ ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై వినియోగదారులకు లభిస్తుంది. త్వరలో ఈ ప్లాన్లను అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here