దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు

0
122

అమెరికా దళాలే లక్ష్యంగా మరోసారి దాడులు జరిగాయి. ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై.. రాకెట్లతో దాడులు జరిగాయి. తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు ​పేలినట్లు.. ఇరాక్ ​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దాదాపు రెండు రాకెట్లు అమెరికా దళాలు ఉన్న స్థావరాల వైపు దూసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎవరూ బాధ్యత వహించలేదు.

కాగా.. గత ఆదివారం అల్ బలాద్ వైమానిక స్థావరంపై కూడా ఇదే తరహాలో రాకెట్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య​ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటి నుంచి.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పలుమార్లు రాకెట్ల దాడి జరిగింది. ఇరాన్ ​అగ్ర కమాండర్.. ఖాసీం సులేమానీ హత్య తర్వాత.. అమెరికా సైన్యమే లక్ష్యంగా ఇరాన్​ క్షిపణి దాడులు చేసింది. అయితే మంగళవారం జరిగిన దాడి కూడా ఇరాన్ పనే అయ్యుంటుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

 

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here