మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం

0
114

దిశ లాంటి కఠినతరమైన కేసులు వచ్చిన తరువాత కూడా నిందితుల్లో ఎలాంటి మార్పులూ రావడం లేదు. తాజాగా.. హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మాయమాటలు చెప్పి ఓ విద్యార్థినిని.. సదరు స్నేహితుడే అత్యాచారం చేసిన వైనం ఆలస్యంగా బయటకొచ్చింది. నారాయణగూడకు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. స్నేహితురాలి ద్వారా ఆమెకి కరంటోతు రోహన్ (19) పరిచయమయ్యాడు. అతను యాదాద్రిలో ఐటీఐ చదువుతున్నాడు. డిసెంబర్ 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో.. తన బర్త్‌డే అని చెప్పి ఓ బాలికను తీసుకెళ్లాడు. అనంతరం మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే.. తమ కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తెల్లవారుజామున 4 గంటలకి విద్యార్థిని ఇంటికి వచ్చింది. దీంతో ఏమైందని తల్లిదండ్రులు నిలదీయగా సమాధానం చెప్పలేదు. దీంతో.. ఆమెను పోలీసులు భరోసా కేంద్రానికి పంపించారు. అక్కడి కౌన్సిలర్లు, పోలీసులు మాట్లాడగా అసలు విషయం బయటపెట్టింది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here