ఆర్థిక మందగమనంతో నలిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం

0
122

ఆర్థిక మందగమనంతో నలిగిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం మరోసారి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ను ఆశ్రయిస్తుంది. అంతకంతకూ పడిపోతున్న రాబడులు, పన్ను వసూళ్లతో ఏం చేయాలో అంతుబట్టని కేంద్రం ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే రిజర్వు బ్యాంకు ఒక్కటే దిక్కు అని గుర్తించింది. అందుకే రూ.45,000 కోట్ల నిధులు విడుదల చేయాలనీ ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తోంది. సమయానికి చెల్లింపులు చేయాలంటే కేంద్రానికి మరో మార్గం కనిపించడం లేదు. అందుకే ఈ మొత్తం నిధులను మధ్యంతర డెవిడెండ్‌ రూపంలో వెంటనే చెల్లించాలని కోరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో డెవిడెండ్‌తో పాటు పరిమితి కంటే అధికంగా ఉన్న నిధుల్లో వాటాను కూడా చెల్లించింది. ఇలా 1.48 లక్షల కోట్ల అదనపు నిధులతో కలుపుకొని మొత్తంగా రూ.1.76 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here