మరి రాయలసీమ ప్రజల సంగతి ఏంటి

0
117

రాజధాని అంశం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. కానీ మీడియాకు అభిప్రాయాలు ఉండకూడదు. అన్ని అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమ అభిప్రాయాలను ఎడిటోరియల్ లో చెప్పవచ్చు. ప్రపంచానికి నీతులు చెప్పే తెలుగు మీడియా తాను మాత్రం అందుకు అతీతం అన్నట్లు వ్యవహారిస్తుంది. మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి చేసిన వెంటనే అమరావతి ప్రజలు ఆందోళన చేపట్టారు. వారి డిమాండుతో విభేదించే వారు కూడా వారి ప్రజాస్వామిక హక్కును కాదనలేరు.

మీడియా కూడా వారి ఆందోళనను ప్రపంచం ముందు ఉంచుతుంది. అంత వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో భాగమైన రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకు మంచి ఉదాహరణ వెలుగులోకి రాని సీమలోని ఆందోళన కార్యక్రమాలు. కడప కేంద్రంగా నాలుగు రాయలసీమ జిల్లాల ప్రజలు వందల మంది పార్టీల కతీతంగా ముఖ్యమంత్రి ప్రతిపాదనలో రాయలసీమకు సమన్యాయం కావాలని సీమ సంకల్ప దీక్ష చేస్తున్నారు. కానీ ఒక్క మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రధాన అంశంగా చర్చ చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here