నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి

0
109

అంబులెన్సులు సకాలంలో రాకపోవడంతో ఓ మహిళ నడిరోడ్డుపైనే ప్రసవించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట్‌ గ్రామానికి చెందిన గుండాల రాధ గర్భిణి. ఉదయం 8 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలవడంతో ఏఎన్‌ఎం సుశీలకు సమాచారమిచ్చారు. ఆమె ఐటీడీఏ ‘అవ్వాల్‌’ వాహన సిబ్బందిని సంప్రదించగా, నెల రోజులుగా డీజిల్‌ లేక వాహనం నడవడం లేదని వారు సమాధానమిచ్చారు. తర్వాత 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా, అదీ అందుబాటులో లేదు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, సిరికొండ సమీపంలో నొప్పులు ఎక్కువయ్యాయి. రోడ్డుపైనే అదే వాహనాన్ని అడ్డుపెట్టి, చుట్టూ చీరలు కట్టి కుటుంబ సభ్యులే ప్రసవం చేశారు. మగబిడ్డను ప్రసవించిన ఆమెను ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here