జారిపడిన విమాన ఇంధనం స్కూలు పిల్లలకు స్వల్ప గాయాలు

0
123

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఓ విచిత్రం జరిగింది. చైనాలోని షాంఘైకి బయల్దేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానమొకటి ఎమర్జన్సీ ల్యాండింగ్ కోసం తిరిగి లాస్ ఏంజిలిస్ విమానాశ్రయానికి వస్తూ.. కిందకు ఇంధనాన్ని (ఫ్యూయల్) కుమ్మరించింది. భూమికి సుమారు 7,775 అడుగుల ఎత్తున ఆకాశంలో ఎగురుతున్న ఈ ప్లేన్.. ఇంజన్ లో లోపం కారణంగా అత్యవసరంగా దిగుతూ.. ఓ స్కూలుపై ఇంధనాన్ని జారవిడిచింది. స్కూలు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలు దీంతో శ్వాస సరిగా ఆడక ఇబ్బంది పడ్డారు.సుమారు 20 మంది విద్యార్థులు, 11 మంది పెద్దలు స్వల్ప గాయాలకు గురయ్యారు. ఈ ఘటనలో ఇంధన ప్రభావం వల్ల కొందరికి కళ్ళు మండగా.. మరికొందరు ఇరిటేషన్ కి గురై బాధపడ్డారు. వీరినందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here