Sunday, January 23, 2022

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999
Home Blog Page 127

సేవ‌లు లేక‌పోతే జ‌రిమానా నెట్‌వ‌ర్క్స్‌ భ‌ర‌తం ప‌డుతున్న‌ ట్రాయ్‌

0

—————————————————–
సేవ‌లు లేక‌పోతే జ‌రిమానా
నెట్‌వ‌ర్క్స్‌ భ‌ర‌తం ప‌డుతున్న‌ ట్రాయ్‌
ముంబ‌యి
వినియోగ‌దారుల‌కు ఏవైనా సమ‌స్యలు వ‌చ్చిన‌ప్పుడు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించే నెట్‌వ‌ర్కింగ్ సంస్థ‌ల‌పై ట్రాయ్ గ‌త సంవ‌త్స‌రం నుంచి కొర‌డా ఝ‌ళిపిస్తున్న‌ది. ఇందులో భాగంగానే వాటికి భారీ జ‌రిమానాలను గ‌తంలో విధించింది. అయినా కూడా మారని ఈ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ కొత్త నిబంధ‌న‌ల‌నూ తెర‌పైకి తీసుకొస్తున్న‌ది ట్రాయ్‌. దేశంలోని ప్ర‌ముఖ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లైన భార‌తీ ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌, రిల‌య‌న్స్ జియో ఇలా ఒక‌టేమిటీ ట్రాయ్ వేసిన జ‌రిమానా అందుకోని నెట్‌వ‌ర్క్ సంస్థ లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో వినియోగ‌దారుల‌కు క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల విష‌యంలో ట్రాయ్ విధించిన అధికారిక నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ స‌రైన నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించ‌డంలో చాలా వ‌ర‌కు నెట్‌వ‌ర్క్ సంస్థ‌లు విఫ‌ల‌మ‌య్యైయి. ఇందులో భాగంగానే వాటికి భారీ జ‌రిమానాల‌ను విధించింది ట్రాయ్‌. 2016లో జియో రంగ‌ప్ర‌వేశం ఓ సంచ‌ల‌నం. దాని రాక‌తో అంద‌రూ పోర్ట్ పెట్టుకుని వేరే నెట్‌వ‌ర్క్ నుండి జియో నెట్‌వ‌ర్క్‌కి భారీగా మారారు. జియో ఇచ్చే పోటీని త‌ట్టుకోలేక చాలా కంపెనీలు మూత‌ప‌డ్డాయంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌మాన‌దు. కొన్ని కంపెనీలు జ‌ట్టుగా ఏర్ప‌డి జియోతో పోటీప‌డ‌టానికి సిద్ధ‌ప‌డుతున్నాయి. అయితే జియోకి కూడా ట్రాయ్ జ‌రిమానా విధించింది. దాదాపు రూ.34 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఫైన్‌గా పేర్కొంది. ఎయిర్‌టెల్‌పై రూ 11 ల‌క్ష‌లు. ఐడియాపై రూ.12.5 ల‌క్ష‌లు. ఈ లిస్ట్ చాలా పెద్ద‌దే. వినియోగ‌దారుల నుంచి ఎటువంటి కంప్లైంట్ వ‌చ్చినా..దానిని సీరియస్‌గా తీసుకుంటామ‌ని, విడిచిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని ట్రాయ్ 2017లోనే స్ప‌ష్టం చేసింది. అదే సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 1న క‌ఠిన‌మైన, కొత్త నిబంధ‌న‌ల‌తో ట్రాయ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల స‌ర్వీస్‌ను నిశితంగా ప‌రిశీలిస్తూన్న‌ది. ఎవ‌రైనా స‌రే వినియోగ‌దారుల సేవ‌కు ఆటంకం క‌లిగించినా, వారిని ఇబ్బందుల‌కి గురిచేసినా దానికి అనుగుణంగా జ‌రిమానాలు విధిస్తామ‌ని ట్రాయ్ గతంలోనే పేర్కొంది. ట్రాయ్ నిబంధ‌న‌ల మేర‌కు కాల్స్ విష‌యంలో ఎవ‌రైనా స‌రే నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించ‌క‌పోతే.. వారికి త‌గిన గుణ‌పాఠం చెపుతుంది ట్రాయ్‌. క‌స్ట‌మ‌ర్ కేర్‌, కాల్ సెంట‌ర్స్, వాయిస్ కాల్స్ డ్రాప్‌, బిల్లింగ్ స‌మ‌స్య‌లు, ఏవైనా లోపాలు ఇలాంటి ఏ సమ‌స్య వ‌చ్చినా వాటిని త‌గిన గ‌డువులోగా తీర్చాలి. లేదంటే వారి ప‌ని అంతే. అందుకే ఇక నుంచైనా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఖ‌చ్చితంగా నియ‌మ‌నిబంధ‌ల‌ను అవ‌లంభిస్తే.. వారికి ఎటువంటి జ‌రిమానాల‌ను ట్రాయ్ విధించ‌దు. అలా కాద‌ని వాటిని ప‌క్క‌న పెడితే జ‌రిమానాల‌తో పాటూ దానికి మూల్యం చెల్లించ‌క తప్ప‌దు.

Gunjnor won

0

Uzbekistan’s Gulnor Sulaymanova ,in green, competes against India’s Pingky Balhara during their women’s -52kg final kurash match at the 18th Asian Games in Jakarta, Indonesia.

Tisva store opened by Saina

0
Saina Nehawal opened the store

Tisva, the premium home decorative lighting brand from Usha International Limited, today launched a new designer range of lights in the City of Nawabs – Hyderabad. The Autumn Collection was launched by ace shuttler Saina Nehwal, who is back after winning glory for India at the recently concluded Asian Games. This new collection is an elegant range that includes intricate chandeliers, fabulous pendants, and glamorous wall lights – each luminaire a piece of art in itself.Tisva inspired by the concept of Tvisa (light) and Tattva (essence) was launched in April 2014. True to its name, Tisva goes beyond ordinary lighting concepts and brings aesthetic luminaires designed with love to illuminate contemporary homes. Tisva is an addition to the diversified portfolio of Usha International Limited. Tisva has 11 exclusive stores pan India – Bangalore, Hyderabad, New Delhi, Ghaziabad, Mumbai, Pune, Baroda, Chandigarh, Jaipur, Indore, and Jalandhar