పొత్తుతో నాదెండ్లకు కేంద్ర మంత్రి పదవి ?

0
111

పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన పొత్తుకు తెరతీశారు. దాని ప్రభావం ఉంటుందా.. ఉండదా అనేది పక్కకు పెడితే… ఒక నూతన రాజకీయ సమీకరణం అని మాత్రం చెప్పక తప్పదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తొలిసారి రాజకీయ వేదికపైకెక్కిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత స్తబ్దుగా మారిపోయాడు. 2014 ఎన్నికలకు ముందు, తాను ఒక పార్టీ పెడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. జనసేన ఆవిర్భావం కూడా జరిగింది. పవన్ ఇజం అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు. ఆతరువాత కొన్ని రోజుల్లో ఉన్న ఎన్నికలకు పార్టీ అప్పుడే సిద్ధంగా లేనందున టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించి, ఆ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఏ సమస్య మీదైనా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయ చిత్రపటంపైన కనబడ లేదు. పవన్ పార్ట్ టైం రాజకీయ నాయకుడంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఎద్దేవా కూడా చేసింది. ఇక మధ్యలో అడపాదడపా ఉద్యమాలు చేసినా, ఆ ఫ్లోని మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here