నింగిలోకి విజయవంతంగా జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం

0
116

దుమ్మురేపిన ఇస్రో
భారత్ గర్వించే ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయి చేరింది. ఇస్రో మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని చాటింది. అత్యంత శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జి-శాట్ 30ని విజయవంతంగా ప్రయోగించింది.

ఏరియాన్ -5 వాహకనౌక 38నిమిషాల్లో జీ-శాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ట్విట్ చేశారు. ఇన్ శాట్ – 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్ -30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ ఏరియాన్ స్పేస్ సీఈఓ స్టెఫాన్ ఇస్రాల్ ట్వీట్ చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీని బరువు 3357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here