భారత జట్టులో మూడు మార్పులు

0
110

కొత్త సంవత్సరంలో తొలి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. శ్రీలంకతో శుక్రవారం జరిగే ఆఖరి టి20లోనూ గెలిచి 2-0తో కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో జోరు మీదుంది. మలింగ సారథ్యంలోని లంక జట్టు చాలా బలహీనంగా ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే లంక సంచలన ప్రదర్శన చేయాల్సిందే. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన లంక కెప్టెన్‌ లసిత్‌ మలింగ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్‌, లక్షణ్‌ సందాకన్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్లుగా మైదానంలో సత్తా చాటేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌లకు ఎట్టకేలకు చోటు దక్కింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో చాహల్‌ను ఎంపిక చేశారు. శివమ్‌ దూబే, రిషబ్‌ పంత్‌ స్థానంలో మనీశ్‌, శాంసన్‌లకు అవకాశం కల్పించారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here