శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌

0
124

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు ఎయిర్‌పోర్టు నిర్వాహక సంస్థ జీఎంఆర్‌ తెలిపింది. ప్యాసింజర్‌ టెర్మినల్‌, కార్గో టెర్మినల్‌, ఇంటర్నేషనల్‌ డిపార్చర్‌, పార్కింగ్‌, బస్టాండ్‌ ఏరియాలు, ఎయిర్‌పోర్టు అరీనా, నోవోటెల్‌ హోటల్‌, రోటరీ చౌరస్తా, హజ్‌ టెర్మినల్‌, ఏటీసీ టవర్స్‌ ఏరియాల్లో భద్రత పెంచారు. ఎయిర్‌పోర్టు విస్తరణ జరుగుతున్న ప్రాంతంలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌స్క్వాడ్‌లతో ఎయిర్‌పోర్టులో గస్తీ కాస్తున్నారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here