అరటిపండు కేక్‌ తయారీవిధానం

0
130

కావలసిన పదార్థాలు: మైదా పిండి: అరకిలో, చక్కెర పొడి: రెండు కప్పులు, వెన్న: అరకిలో, బ్రౌన్‌ షుగర్‌(సూపర్‌మార్కెట్లలో దొరుకుతుంది): రెండు కప్పులు, గుడ్లు: ఎనిమిది నుంచి పది(బాగా గిలక్కొట్టుకోవాలి), అరటిపండు: పదిలేక పన్నెండు(వీటిని బాగా చిదిమి పెట్టుకోవాలి), జీడిపప్పు: రెండుకప్పులు, బనానా ఎసెన్స్‌: టేబుల్‌ స్పూను, వెనిలా ఎసెన్స్‌: అర టీస్పూను, వంటసోడా: టేబల్‌ స్పూను, బేకింగ్‌ పొడి: నాలుగు టీస్పూన్లు, గోరువెచ్చని పాలు: అరకప్పు, కిస్మిస్‌: పావు కప్పు(ఇష్టమైతేనే)

తయారీవిధానం: మైదా, బేకింగ్‌ పొడి జల్లించుకుని వీటికి వంటసోడా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో వెన్న, చక్కెరపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒకదాని వెనుక మరొకటి చొప్పున బ్రౌన్‌ షుగర్‌, గుడ్డు, అరటిపండు ఎసెన్స్‌ కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి చిదిమిపెట్టుకున్న అరటిపండు గుజ్జును చేర్చుకోవాలి. ఈ మొత్తం మిశ్రమానికి మైదా చేర్చి వుండలు లేకుండా మృదువుగా వచ్చేంత వరకూ కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని పాలు కూడా జతచేయవచ్చు.
ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ బౌల్‌లోకి మార్చి ఓవెన్‌లో 200ఇ దగర్గ కనీసం పదిహేను నిమిషాలు పాటు వేడిచేయాలి. అనంతరం దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కావలసిన సైజులో కట్‌ చేసుకోవచ్చు. వెజిటేరియన్‌ వాళ్లు గుడ్లు వాడకుండా కూడా చేసుకోవచ్చు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here