Cyberabad Annual Sports And Games Meet – 2019

0
180
Sports and games 2019
Cyberabad Sports and games meet

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ (Sports And Games)- 2019 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభమైంది.ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ( ఫైనాన్స్) శ్రీ కె.రామకృష్ణ రావు, ఐఏఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఫైనాన్స్) శ్రీ కె. రామకృష్ణారావు,ఐఏఎస్., బెలూన్లు పావురాలను ఎగరేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఆయన వివిధ జోన్ ల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసుల కవాతు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు.

పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి అన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్యం, మానసికోల్లాసం కోసం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసిన సైబరాబాద్ సిపి ని ఆయన అభినందించారు. తెలంగాణ పోలీసు సిబ్బంది ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు అన్నారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.,మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో వివిధ జోన్ల పోలీసు క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. పోలీసులు క్రీడలో పాల్గొనాలని కోరారు.

నిత్య జీవితంలోనూ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ( ఫైనాన్స్) శ్రీ కె.రామకృష్ణ రావు, ఐఏఎస్., సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, బాలనగర్ డిసిపి పద్మజా, డీసీపీ క్రైమ్స్ జానకీ షర్మిలా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here