ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ అవార్డు వీరుడు విరాట్

0
138

ఐసీసీ (ది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) 2019 సంవత్సరానికిగానూ అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 వరల్డ్‌కప్‌లో స్టీవ్‌స్మిత్‌ను ప్రోత్సహించాలని విరాట్‌ తన సైగలతో అభిమానులకు సూచించారు. ఎందుకంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌ కెప్టెన్సీలో.. వార్నర్‌ సహా మరో ఆటగాడు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. దీంతో స్మిత్‌, వార్నర్‌లకు ఏడాది నిషేదం విధించింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. నిషేధం పూర్తయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన స్మిత్‌ను ఎవరూ పట్టించుకోకపోయేసరికి కోహ్లి అభిమానులకు తన సైగలతో స్మిత్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకుగానూ కోహ్లికి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు లభించింది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here