ఎలాంటి వస్తువునైనా కాపీ కొట్టగలిగే నేర్పరితనం చైనా సొంతం. ఇటీవలే కృత్రిమంగా జాబిల్లిని సృష్టించిన చైనా తాజాగా సూర్యుడికి నకలు తయారుచేసేందుకు సిద్ధమైంది. సూర్యుడి శక్తిని భూమ్మీదే పొందడం కోసం ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టింది చైనా. ఈ ప్రాజెక్టుకు చైనా శాస్త్రవేత్తలు హెచ్ఎల్-2ఎం టోకమాక్ అనే పేరు పెట్టారు. సూర్యుడిపై ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కృత్రిమ సూర్యుడ్ని కూడా అదే విధంగా రూపొందించనున్నారు.