దేశీయ మార్కెట్లో పడిపోతున్న వాహన విక్రయాలు

0
141

దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు డిసెంబరుమాసంలో క్షీణతను నమోదు చేసాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 1.24 శాతంక్షీణించి 2,35,786 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,38,753 యూనిట్లుగా వుంది.

దేశీయ కార్ల అమ్మకాలు 8.4 శాతం తగ్గి 1,42,126 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 డిసెంబర్‌లో 1,55,159 యూనిట్లు. గత నెలలో మోటార్‌సైకిల్ అమ్మకాలు 12.01 శాతం క్షీణించి 6,97,819 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 7,93,042 యూనిట్లు.డిసెంబరులో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.6 శాతం క్షీణించి 10,50,038 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 12,59,007 యూనిట్లు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 12.32 శాతం తగ్గి డిసెంబర్‌లో 66,622 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ తెలిపింది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here