సీక్రెట్ బీచ్ సూర్య‌లంక బీచ్

0
309

దేశంలోని అరుదైన బీచ్‌లు ఎన్నో ద‌క్షిణ భార‌త‌దేశంలో ఉన్నాయి. ఎక్కువ తీర ప్రాంతం కూడా ఉన్న‌దే ద‌క్షిణప‌థంలోనే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ ఎన్నో బీచ్‌లు భార‌తీయులతో పాటూ ప్ర‌పంచ యాత్రికుల‌ను ఆక‌ట్టుకుంటాయి. బాప‌ట్ల రైల్వే స్టేష‌న్ నుండి కేవ‌లం 7 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సూర్య‌లంక బీచ్ గురించి స్థానికులకు తెలిసినా… చాలామందికి ఈ సీక్రెట్ బీచ్ గురించి తెలియదు. రాజ‌ధాని అమ‌రావ‌తికి కేవ‌లం 84 కిలోమీట‌ర్లే. అంద‌మైన సాగ‌రతీరం చేరుకోవ‌టానికి హైద‌రాబాద్ నుండి కారులో అయితే జ‌స్ట్ 6 గంటల ప్ర‌యాణం. పెద్ద‌గా ర‌ద్దీగా లేక‌పోయినా సీజ‌న్‌లో మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా కిత‌కిత‌లాడుతుంటుంది. ఉండ‌టానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగం నివాసాలు ఏర్ప‌రిచినా.. అవి కూడా ఫుల్ అవుతాయి.
లైవ్ ఫిష్‌తో పాటూ బోటింగ్ ఇంకా బోలెడు ఫ‌న్ ఉండే సూర్య‌లంక బీచ్ ఎవ‌రైనా స‌రే, ఎప్పుడైనా స‌రే వెళ్లి ఫుల్ రిఫ్రెష్ అవ్వొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here