విజయ్ దేవరకొండకు మరో షాక్… యువకుల అరెస్ట్, ఏం జరిగిందంటే?

0
914
UIB Media

‘గీత గోవిందం’ సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో లీక్ అవ్వడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకున్న నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని గంటల్లోనే ఈ కేసును చేధించారు. ఈ కేసులో పలువురు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను సైతం అరెస్టు చేశారు. హైదాబాద్‌లో డిజిటల్ బ్యాంకులో పని చేస్తున్న ఒక వ్యక్తి ద్వారా సినిమాలోని సీన్లు లీక్ అయినట్లు

UIB Media

గుర్తించారు. తాజాగా మరో విజయ్ దేవరకొండ సినిమా లీక్ అయినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ నెక్ట్స్ రిలీజ్ ‘నోటా’ విషయంలో కాకుండా… విడుదల కాకుండా హోల్డ్‌లో ఉన్న ‘టాక్సీవాలా’ విషయంలో లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ కూడా లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే దాని గురించి పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ లభించలేదు. తాజాగా ‘టాక్సీవాలా’ చూస్తూ కొందరు యువకులు పట్టుడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో ‘టాక్సీవాలా’ చూస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని సైబర్ ఇన్వెస్టిగేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది.

ఇంకా విడుదలకాని ‘టాక్సీవాలా’ సినిమా వీరి మొబైల్‌లోకి ఎలా వచ్చింది? ఎవరెవరితో వారికి సంబంధాలు ఉన్నాయి అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ వారు కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌ సంస్థ‌లు జిఏ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్‌కె‌ఎన్ నిర్మాత‌. రాహుల్ సంకృత్యాన్ అనే కొత్త దర్శకుడుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ సరసన మాళవికా నాయర్, ప్రియాంకలు నటించారు. ‘గీత గోవిందం’ కంటే ముందే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా…. పలు కారణాలతో వాయిదా వేశారు. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు? అనే విషయంలో ఇప్పటి వరకు దర్శక నిర్మాతల నుండి ఎలాంటి క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here