వాట్సాప్‌ గ్రూపు నిర్వాహకుడు, సభ్యుడు జైలుపాలు

0
204
వాట్సాప్‌ గ్రూపు నిర్వాహకుడు
వాట్సాప్‌ గ్రూపు నిర్వాహకుడు

మల్కాజిగిరి: విద్వేషాలను రెచ్చగొట్టే చిత్రాలను వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేసిన వ్యక్తిని, ఆ వాట్సాప్‌ గ్రూపు నిర్వాహకుడు ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మన్మోహన్‌, ఎస్సై అశోక్‌ కుమార్‌ కథనం ప్రకారం.. మౌలాలి షఫీనగర్‌లో నివసించే మహమ్మద్‌ సాహెబాజ్‌ ఉల్‌ మునీర్‌ అలియాస్‌ సిరాజ్‌ (26) జొమాటోలో డెలివరీ బాయ్‌. సహోద్యోగి కుషాయిగూడ నాగార్జున్‌నగర్‌కు చెందిన కమ్మంపల్లి వెంకటేష్‌.. జొమాటోలో పనిచేసే వారి కోసం లాయల్‌ పార్టనర్స్‌ ఎమలార్డ్‌ పేరుతో వాట్పప్‌ గ్రూపును నిర్వహిస్తున్నాడు.

జాతీయ పతాకాన్ని తగులబెడుతున్న చిత్రాన్ని గత నెల 26న సిరాజ్‌ ఆ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఈ చిత్రాన్ని ఆ గ్రూపు సభ్యుడు పి.తిరుమలేశ్వరరెడ్డి చూశాడు. ఈ చిత్రం విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని గత మంగళవారం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సిరాజ్‌ను, ఆ గ్రూపు నిర్వాహకుడు వెంకటేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here