రైలులో ప్రసవించిన మహిళ.. పురుడు పోసిన ముగ్గురు యువకులు

0
273
యువకులు - TRAIN
YOUNG MEN SAVES PREGNANT WOMEN IN TRAIN

కోల్‌కతా – యువకులు : కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిల నుంచి ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలపై జరుగుతున్న వికృతచేష్టలు నేటి రోజుల్లో ఎన్నో… ప్రేమ కాదన్న కోపంతో పెట్రోల్,యాసిడ్ వంటి దాడులకు సైతం తెగిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం వల్ల సమాజంలో మహిళల పట్ల గౌరవప్రదంగా మెలిగే మగవారు ఉన్నారనే విషయాన్నే మర్చిపోయే పరిస్థితి వచ్చింది.

కోల్‌కతాలో జరిగిన ఈ సంఘటనతో మహిళల పట్ల మగవారికి ఉండే సోదరి ప్రేమను చూపుతోంది. కోల్‌కతాలోని బిజార్రెలో ఓ మహిళ రైలు ప్రయాణంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అగర్తలా- హబిజ్‌గంజ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. రైలు ఎక్కిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు రావడం జరిగింది. దీంతో కొంత మంది ప్రయాణికులు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించగా… ముగ్గురు యువకులు మాత్రం (మహ్మద్ సోహ్రాబ్, సుబాదాద్ గాడ్వా, త్రిభువన్ సింగ్) ఆమెను సొంత తోబుట్టువులా భావించి సేవలందించారు. రైల్లో ఉండే ప్రయాణికుల వద్దకు వెళ్లి కొన్ని బట్టలు సేకరించారు. వాటి సాయంతో ఆమె చుట్టూ కట్టారు. కానీ రైల్లో డాక్టర్ లేకపోవడంతో.. వారే ఆమెకు పురుడు పోశారు. ఆపై ఆమె పండంటి శిశువుకు జన్మనిచ్చింది దీంతో ఆ యువకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రసవం అనంతరం ఆమెకు వైద్యం అవసరమయ్యే పరిస్థితి కనిపించింది. దీంతో రైలు చెయిన్ లాగి స్థానిక స్టేషన్ దగ్గర ఆపారు. అప్పటికే రైల్వే అధికారులకు వారు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమెకు వైద్య సాయం అందింది. తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రాథమిక చికిత్స చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు వైద్యం అందే వరకు ఆ ముగ్గురు యువకులు అక్కడే ఉండి.. వారు మరో రైలుకు వెళ్లిపోయారు. ఆమెకు సాయం అందించిన యువకుల్నీ ప్రయాణికులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here