విజయవాడ లో జనసేన భేటీ

0
1743
ఈ మార్పు కోస‌మే నేను 2014లో జ‌న‌సేన పార్టీని ప్రారంభించాను. * దీనికి తోడు తృతియ ప‌క్షం లేని ప‌క్షంలో ఉన్న రెండు రాజ‌కీయ ప‌క్షాలు త‌మ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్ర‌మాదం ఉన్నందున మ‌ధ్యే మార్గంగా జ‌న‌సేన ఆవిర్భావం జ‌రిగింది.

జ‌న‌సేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్యాల‌యంలో క‌డ‌ప జిల్లా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మీక్షా స‌మావేశం.
* పార్టీ శ్రేణుల‌కి దిశానిర్ధేశం చేసిన పార్టీ అధినేత ప‌వ న్
* ఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న కోసం ఒక ప‌క్క విప‌రీత‌మైన పోరాటం జ‌రుగుతుంటే, ఆ పోరాటం తాలూకు ఒత్తిడిని త‌ట్టుకునే నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క‌రు కూడా లేకుండా పోయారు.
* ఇందిరాగాంధీ లాంటి రాజ‌కీయ సంక‌ల్పం బ‌లంగా ఉన్న నేత‌లు ఎలాంటి ఒత్తిడిని అయినా అవ‌లీల‌గా త‌ట్టుకునే వారు. ఆవిడపై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా త‌న సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విభ‌జించేందుకు అంగీక‌రించ‌లేదు. అటువంటి నేత‌లు మ‌న‌కు ఇప్పుడు క‌నుమ‌రుగైపోయారు.
* 90వ ద‌శ‌కం చివ‌రిలోనే తెలంగాణ బావ‌జాలం బ‌ల‌ప‌డ‌డాన్ని నేను గ‌మ‌నించాను. ముఖ్యంగా యువ‌త‌లో ఈ కోరిక బ‌ల‌ప‌డ‌డాన్ని గ్ర‌హించాను. ఇది మార్పుకి సంకేతంగా నేను భావించాను.
* తెలంగాణ‌-ఆంధ్ర ప్రాంతాలు సాంస్కృతికంగా స‌మ్మిళితం కాలేక‌పోయాయి. ఇది కూడా వేర్పాటు బీజాల‌ అంకురార్ప‌ణకి కార‌ణం.
* రాయ‌ల‌సీమ‌లో కూడా ఇటువంటి ప‌రిస్థితే ఉంది దీనిపై మ‌నం ఆలోచ‌న చేయ‌క‌పోతే భ‌విష్య‌త్తులో ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా మారుతాయి.

* ప్ర‌జారాజ్యం పెట్ట‌క ముందు నేను కామ‌న్‌మెన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఏర్పాటు చేశాను. ఆ స‌మ‌యంలో నాతోపాటు ఎవ‌రైతే ఉన్నారో వారే జ‌న‌సేన ఆవిర్భావ స‌మ‌యంలో నాతోపాటు ఉన్నారు.
* 2003లోనే నేను రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అప్ప‌టినుంచే ప్ర‌పంచ‌, దేశ‌, రాష్ట్ర స‌మ‌కాలీన రాజ‌కీయ ప‌రిస్థితుల్ని అధ్య‌య‌నం చేస్తూ వ‌చ్చాను.
* నా రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌కి అనుగుణంగానే నా సినిమాల‌కి కూడా రూప‌క‌ల్ప‌న చేశాను. దృఢ‌మైన భావ‌జాలంతోనే జ‌న‌సేన‌కు రూప‌క‌ల్ప‌న చేశాను.
* నేను వ్య‌వ‌స్థ‌ని బ‌ల‌ప‌ర్చ‌డానికి వ‌చ్చానే త‌ప్ప వ్య‌క్తిగా బ‌ల‌ప‌డ‌డానికి రాలేదు.
* పోరాటం చేసే వారికే గెలుపు సిద్ధిస్తుంది. గెలుపు కోస‌మే ప‌ని చేసే వారితో గెలుపు దోబూచులాడుతుంది.
* నాకు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేయాలని ఉందంటూ ఓ ప‌క్క‌న జ‌గ‌న్ అంటుంటే, మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేయ‌మ‌ని నారా చంద్ర‌బాబు నాయ‌డుగారు అంటున్నారు.
* అధికారం కోసం ఆలోచించే వారికి ప్ర‌జా సంక్షేమం ప‌ట్ల చిత్త‌శుద్ది ఉండ‌దు. ఇది మ‌న‌కి చ‌రిత్ర చెబుతున్న పాఠం.
* పోలిటిక్స్ నాకు వ్యాపారం కాదు. రాజ‌కీయాల్లో నేను డ‌బ్బు సంపాదించ‌న‌క్క‌ర్లేదు. స్టార్ డ‌మ్ ఉన్న‌త స్థితిలో ఉన్న స‌మ‌యంలోనే నేను క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాను.
* 2003 నుంచి డ‌బ్బు ప్ర‌భావిత రాజ‌కీయాలు మ‌న తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి.
* ఆ స‌మ‌యంలోనే ఇటువంటి వ్య‌వ‌స్థ‌ని మార్చ‌డానికి ఒక నాయ‌కుడు అవ‌స‌రం అని భావిస్తున్న త‌రుణంలో చిరంజీవి గారు ప్ర‌జారాజ్యాన్ని స్థాపించారు.
* అయితే ల‌క్ష్య ఛేద‌న‌లో ఆయ‌న ప‌క్క‌న ఉన్న‌వారే ఆయ‌న్ని నిరాశ‌కు గురిచేశారు.
* అటువంటి స్థితి త‌ర్వాత నేను జ‌న‌సేన‌ను స్థాపించి కోట్లాది మంది జ‌నం అభిమానం పొందుతున్నానంటే నేనెంత మొండివాణ్ణో అర్ధం చేసుకోవ‌చ్చు.
* అయితే కొత్త‌గా పార్టీని స్థాపించినందు వ‌ల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి.. అవ‌న్నీ నాకు అవ‌గ‌త‌మే. ఇలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే ధైర్యం, స‌త్తా జ‌న‌సేన శ్రేణుల‌కి ఉన్నాయి.
* ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ జిల్లాలో చూసినా రాజ‌కీయం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండిపోయింది.
* ఈ కుటుంబాలు స్వ‌లాభం కోసం రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌జ‌లను విస్మ‌రిస్తున్నాయి.
* మ‌నం ఎదుటి వారిని ప్ర‌శ్నించాలంటే మ‌న‌కు నైతిక బ‌లం ఉండాలి.
* ఆ నైతిక బ‌లం కోస‌మే 2014 స‌మ‌యంలో రాష్ట్రంలో తెలుగు దేశానికీ, కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికాను.
* 2014లో ప‌రిమిత స్థానాల్లో పోటీ చేద్దామ‌ని తొలుత భావించాను. అయితే అలా ప‌రిమిత స్తానాల్లో పోటీ చేయ‌డం వ‌ల్ల పార్టీ బ‌ల‌ప‌డ‌ద‌న్న ఆలోచ‌న‌తో పోటీకి దూరంగా ఉండిపోయాను. ఫ‌లితంగా జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌లికిన తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రంలో విజ‌యం సాధించాయి.
* టీడీపీలో వ్య‌క్తులెవ‌ర్నీ నేను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేదు. జ‌న‌సేన ఐడియాల‌జీకి అనుగుణంగా ఒక ఫ్రేమ్ వ‌ర్క్‌లో మాత్ర‌మే వారి గురించి మాట్లాడాను.
* ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా చంపేయండి, చింపేయండి వంటి మాట‌ల‌ను నేను ఉప‌యోగించ‌లేదు.
* ఎప్పుడు విమ‌ర్శ చేసినా సంస్కారవంతంగానే జ‌న‌సైనికుల‌కి ఆద‌ర్శ‌వంత‌మైన భాష‌నే ఉప‌యోగించాను.
* మోడీని స‌పోర్ట్ చేయ‌డానికి కార‌ణం ఆయ‌న ప్ర‌ధాని అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి మేలు చేస్తార‌న్న గ‌ట్టిన‌మ్మ‌క‌మే.
* రెండు రాజ‌కీయ ప‌క్షాల‌తో ద‌శ‌, దిశ లేకుండా పోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు దిశానిర్ధేశం చేయ‌క‌పోతే త‌ప్పు చేసిన వారిమ‌వుతామ‌ని భావించి మూడో ప‌క్షంగా జ‌న‌సేన‌ను స్థాపించాను.
* వ్య‌వ‌స్థ‌ను రాత్రికి రాత్రే మార్చ‌లేమ‌న్న విష‌యం నాకూ తెలుసు అందుకే ఓర్పు స‌హ‌నంతో ప‌ని చేసుకుంటూ వెళ్తున్నాను. ఎంత ఒత్తిడి ఉన్నా నేను తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాను. అదే స‌మ‌యంలో ఆ ఒత్తిడిని కార్య‌క‌ర్త‌ల మీద ఎట్టి ప‌రిస్థితుల్లో రుద్ద‌బోను.
* జ‌న‌సైనికులంతా నాయ‌కులుగా మార్పు చెందాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ రాబోయే ఎన్నిక‌లు మ‌న ముందున్న ఒక పెద్ద స‌వాలు.
* జ‌న‌సేన‌కు యువ‌త,మ‌హిళ‌లు అండగా ఉన్నారు. వారి అండ‌తో మ‌నం ఈ ఎన్నిక‌ల్లో ముందుకి వెళ్ల‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం ఉంది.
* జ‌న‌సేన నిర్వ‌హించిన క‌వాతుల‌కి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా త‌ర‌లివ‌చ్చారంటే అది వారిలోని ఆగ్ర‌హాన్ని తెలిప‌రుస్తోంది.
* జ‌న‌సేన‌కు సంస్థాగ‌త క‌మిటీల నియామ‌కాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు వేయ‌లేదంటే మ‌నంద‌రిలోనూ ఒక ఏకీకృతమైన అభివృద్ది చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. ఆ తరహా అభివృద్ధి పోరాటాల ద్వారానే సిద్ధిస్తుంది.
* పండుగ త‌ర్వాత క‌మిటీలు వేయ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్నాను. క‌డ‌ప జిల్లాకి సంబంధించి రాజంపేట, క‌డ‌ప పార్ల‌మెంటు స్థాయి క‌మిటీలు ఉంటాయి.
* డ‌బ్బులు రాజ‌కీయాల‌ని శాసించ‌లేవ‌ని ప‌లు సంద‌ర్భాల్లో రుజువైంది. రాజ‌కీయ పార్టీలు భావ‌జాలంతో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే చిర‌కాలం మ‌నుగ‌డ సాగిస్తాయి.
* రాజ‌కీయాల్లో ఆధిప‌త్యం కోసం కాకుండా వ్య‌వ‌స్థలో మార్పు కోసం జ‌న‌సైనికులు కృషి చేయాలి.
* జ‌న‌సేన‌లో యువ‌త రాజ‌కీయ శ‌క్తిగా మార‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. వారిని రాజ‌కీయ శ‌క్తిగా మార్చే బాధ్య‌త‌ను నేనే తీసుకుంటాను.
* ఐడియాల‌జీ, ప్రాక్టికాలిటీతో జ‌న‌సేన‌ని ముందుకి తీసుకెళ్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here