తొలి భాగస్వామ్య సదస్సు

0
352
Tamilnadu Turisim

రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన తమిళనాడు పర్యాటక శాఖ

తమిళనాడు అంటే అందరికీ గుళ్లు,గోపురాలే గుర్తుకువస్తాయి. కానీ అంతకుమించి ఆ రాష్ఠ్రంలో చాలా ఉన్నాయి. సినిమాలు, సంగీతం,కళలు, నాటికలు, సాంస్క్రతిక కార్యకలాపాలు,వినోదం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోవాటికి తమిళనాడు అడ్డా. ఇందులో భాగంగానే తమిళనాడు పర్యాటక శాఖ హైదరాబాద్లో తొలి భాగస్వామ్య సదస్సును నిర్వహించింది. హైదరాబాద్ కన్వెషన్లో ప్రారంభించిన ఈ సదస్సుకు తమిళనాడు పర్యాటక శాఖ డిప్యూటీ డైరక్టర్ శ్రీ వేణుగోపాల్ నేతృత్వం వహించారు. ఆయనతో పాటూ రాష్ట్రానికి చెందిన మరో 18 మంది వ్యాపార ప్రతినిధులు ఇందులో హాజరయ్యారు. ప్రకృతి,సహజసిద్ధమైన వనరులకు కొలువు తమిళనాడు. వృక్షజాతితో పాటూ, శతాబ్దాల పురాతన ఆలయాలు ఈ రాష్ట్ర ప్రత్యేకత. తమిళనాడు పర్యాటక శాఖ డిప్యూటీ డైరక్టర్ మాట్లాడుతూ.. 2013 నుంచి 2016 వరకు వరసగా మూడు సార్లు జాతీయ స్థాయిలో తమిళనాడు పర్యాటకంలో, తొలి స్థానంలో నిలిచింది. దేశం నుంచే కాక, ఫ్రాన్స్, జర్మనీ, హాలెండ్, కెనడా,బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి తమిళనాడుకు టూరిస్టుల తాకిడి అధికంగా ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని హోదా తమిళనాడుకు యూనెస్కో కల్పించిదని తెలిపారు. 5 పురాతన కట్టడాలకు యూనెస్కో స్థానం ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here