ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు

0
220
చంద్రబాబు నాయుడు
AP CM - Delhi News

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి (AP CM) చంద్రబాబు సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీయేతర పార్టీలతో కలిసి ఈసీని కలవనున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆరోపణలు వస్తుండడంతో దీనిపై ఫిర్యాదు చేయాలని బీజేపీయేతర పార్టీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఈసీకి సమర్పించేందుకు ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. ఈసీతో సమావేశం అనంతరం బీజేపీయేతర పక్షాలు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక ర్యాలీలు నిర్వహించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో్వైపు కోల్‌కతా పరిణామాలపై కూడా బీజేపీయేతర పార్టీలు సమావేశంలో స్పందించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here