ఉపగ్రహ ప్రయోగాల శిక్షణకు నలుగు ఎంపిక

0
125

2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న అంతరిక్ష కార్యక్రమాలను గురించిన వివరాలను సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌ ప్రకటించారు. దేశాభివృద్ధికి ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగాలకు తాము రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా గగన్‌యాన్‌ కార్యక్రమంలో అవసరమైన శిక్షణ పొందటానికి నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినట్టు కూడా ఆయన చెప్పారు.
”2019లో గగన్‌యాన్‌ మంచి ప్రగతిని సాధించింది. దీనికి సంబంధించిన డిజైన్లు చాలా వరకు పూర్తయ్యాయి. గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు భారత వాయుసేనకు చెందిన నలుగురు సిబ్బందిని ఎంపికచేశాం. వీరికి జనవరి మూడవ వారం నుంచి రష్యాలో శిక్షణ మొదలవుతుంది. చంద్రయాన్‌ 3 ప్రమోగం కూడా ఇంచుమించు చంద్రయాన్‌ 2 మాదిరిగానే ఉంటుంది. కాకుంటే దీనిలో అదనంగా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన ఒక రోవర్‌ ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పని చక్కగా సాగుతోంది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here