అతడు ఓ సాధారణ ఆటో డ్రైవర్. కానీ.. ఆయన బ్యాంకు అకౌంట్ లో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే అంత డబ్బు తన దగ్గర ఉందనే విషయం ఆయనకే తెలియదు. దర్యాప్తు సంస్థ అధికారులు నుంచి ఫోన్ కాల్ రావడంతో అసలు విషయం తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాడు ఆటో డ్రైవర్.
వివరాల్లోకెళితే..పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన ముహమ్మద్ రషీద్ ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల రషీద్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. రషీద్ ను తమ కార్యాలయానికి పిలిపించిన ఫెడరల్ దర్యాప్తు సంస్థ (FIA) ఈ విషయంపై ఆరా తీసింది. అయితే, తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియదని ఆ డ్రైవర్ అంటున్నాడు. దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు అక్కడి పోలీసులు.