Thursday, September 16, 2021

ప్ర‌జ‌లే మా బ‌లం. ప్ర‌జ‌ల ప‌క్షం మా అక్ష‌రం.
ప్ర‌శ్నిద్దాం, నిల‌దీద్దాం

కుల‌మ‌తాల‌కు వంగ‌కుండా, రాజ‌కీయాల‌కు లొంగ‌కుండా, అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డానికి, నిష్ప‌క్షపాతంగా వార్తా ప్ర‌సారాల‌ను ప్ర‌జ‌ల‌కందించాల‌నే ఉద్దేశంతో పురుడుపోసుకుందే యుఐబీ మీడియా మీకు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మీరు మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి. మీ ఆలోచ‌న‌ల‌ని మాతో పంచుకోండి. మీ వార్త‌ల‌ను మేం ప్ర‌సారం చేస్తాం.మీ నీడ‌గా ఉంటాం. మీకు అండ‌గా నిలుస్తాం. వాట్సాప్ 8142950999
Home Blog

ఫ్యామిలీ అందరూ హాయిగా నవ్వుతూ చూసే సినిమా ఇది

0
కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్
గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో మంచి యూనిట్‌తో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్`.

కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను రూపొందించ‌డానికి గుడ్ సినిమా గ్రూప్ స‌మాయ‌త్త‌మైన విష‌యం తెలిసిందే..అందులో భాగంగా శ్రీముఖి, భరణి, మనో, పోసాని కృష్ణ మురళి,రాజా రవీంద్ర ముఖ్య పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `క్రేజీ అంకుల్స్`. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న‌ ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మిన‌హా పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..

ప్ర‌ముఖ సింగ‌ర్‌, న‌టుడు మ‌నో మాట్లాడుతూ – “క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించాను. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో మంచి యూనిట్‌తో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. షూటింగ్ సరదాగా జరిగింది. . రాజారవీంద్ర‌, శ్రీముఖి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. శ్రీవాస్ గారు భవిషత్తులో ఇలాంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజి అంకుల్స్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు
న‌టుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ – “ఈ సినిమాలో నేను యోగ టీచర్ గా కనిపించబోతున్నాను. కరోన సమయంలో వర్క్స్ లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు గుడ్ సినిమా గ్రూప్స్ వారు వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాది క‌ల్పించ‌డం నిజంగా అభినందించాల్సిన విష‌యం. భవిష్య‌త్తులో గుడ్ సినిమాస్ గ్రూప్ సంస్థ నుండి మ‌రిన్ని మంచి సినిమాలు రావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ త‌ప్ప‌కుండా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది“ అన్నారు.
నిర్మాత‌ శ్రీవాస్ మాట్లాడుతూ – “శ్రేయాస్ శ్రీను గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో నాకు రైటర్ డార్లింగ్ సామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని చేసిన చిత్ర‌మిది. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో ఇలా అందరి రోల్స్ ఆడియన్స్ ను అలరించబోతున్నాయి. డైరెక్టర్ సత్తిబాబు స్క్రిప్ట్ ను బాగా హ్యాండిల్ చేశారు. ఈ కోవిడ్ టైంలో మేము మరింత మందికి హెల్ప్ చెయ్యాలని అనుకుంటున్నాము“ అన్నారు.
న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ – `నేను ఈ మధ్య కాలంలో చేసిన ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్ ఇది. శ్రీవాస్ కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. సినిమా షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది“ అన్నారు.
న‌టి శ్రీముఖి మాట్లాడుతూ – “శ్రేయాస్ శ్రీను గారు ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి సక్సెస్ అయ్యారు. ఆయన ప్రొడక్షన్ చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీవీలో ఎక్కువగా షోస్ చేస్తున్న నేను క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఒక పాట మిన‌హా దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుప‌బోతున్నాం. . గుడ్ సినిమా గ్రూప్ లో ఇదొక మంచి మూవీగా నిలుస్తుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.
చిత్ర ద‌ర్శ‌కుడు ఇ. సత్తిబాబు మాట్లాడుతూ – “గుడ్ సినిమా బ్యాన‌ర్‌లో రాబోతున్న క్రేజీ అంకుల్స్ చాలా ఫన్నీగా అందరిని అలరించే విధంగా ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ అంద‌రం ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది“ అన్నారు.
నటి హేమ మాట్లాడుతూ – “క్రేజీ అంకుల్స్ కథ నాకు బాగా నచ్చింది. శ్రేయాస్ శ్రీను గారితో నేను చాలా ఈవెంట్స్ చేశాను, అతనితో కలిసి సినిమా చెయ్యడం హ్యాపీగా ఉంది“ అన్నారు.

శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, భరణి, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్పై, మహేంద్ర నాథ్, సిందూరి, మాధురి త‌దిత‌రులు న‌టిస్తోన్న
ఈ చిత్రానికి…
కథ, మాటలు: డార్లింగ్ సామి,
సినిమాటోగ్రఫీ: పి. బాలరెడ్డి,
సంగీతం: రఘు కుంచె,
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి,
పబ్లిసిటీ డిజైనర్: ధ‌ని ఏలే,
స్టిల్స్: పిల్.గణపతి,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అడ్డాల శ్రీనివాస్, ఆనంద్ తాళ్లూరి,
లైన్ ప్రొడ్యూసర్: సాయిబాబు వాసిరెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి,
ఫైనాన్స్ డైరెక్టర్: రవి కొమ్మినేని,
ప్రజెంట్స్: కిరణ్ కె తలసిల,
కోప్రొడ్యూసర్: లయన్ వై కిరణ్,
ప్రొడ్యూసర్స్: గుడ్ ఫ్రెండ్స్,
డైరెక్టర్: ఇ. సత్తిబాబు.

LEARNING NEVER STOPS

0

The Narayana Group of Educational Institutions has taken up the challenge of total        lock down across India due to the Corona virus pandemic across the world from March 23 till April 14, 2020. In order to ensure that students of Narayana continue to learn at home in safety as usual during the lock down period, Narayana has launched Online classes, tests and deep learning apps, Learn and Narayana Online Test Series through the Internet on March 23′, 2020 itself and will continue till the lock down ends.
With the help of these online learning apps, Narayana is now streaming a daily average of 10,000+ live online classes across the country in more than 600 branches of Narayana for more than 75,000 students. Further, Narayana is hosting live exams and posting exam video solutions on the web, Android tab and mobile applications respectively. In addition, assignments, solutions, audio lectures and videos are being distributed directly to the student’s mobile phone via Connect App. All the teachers are available online to guide the students.
The Management of Narayana Group of Educational Institutions remains fully committed to ensure the health and safety of our students, teachers and non-academic support. Safety is of paramount importance. Hence Narayana’s online classes and learning process will ensure that all students study in the comfort of their own home.

 

Memories for life time

0
First director from Asia to be awarded in Oscar

Bong joon ho, he is an south Korean film director and screen writer. He was born 14 September 1969.Bong joon ho’s parasite movie wins the Oscar. The Oscar-nominated film ‘Parasite’ is set to release in India on January 31.Bong joon ho wins first Oscar for south Korea with best original screenplay trophy for ‘Parasite’.Bong began shooting his first feature Barking Dogs Never Bite under producer Cha Seung-jae. Bong second film, Memories of Murder, a much larger-scale project and slowly building international word of mouth also .the film reached its financial break-even point due to sales to overseas territories.

TECHNO PAINTS LAUNCHES NEW SHADES IN INDIAN MARKET

0
Company is focusing to establish brand position in international market also. in discussion with local partners to have a JV in African Market.
An ISO 9001:2015 Certified Paints Company, Hyderabad based TECHNO PAINTS today announced the launch of its technologically advanced latest range of colors to its palette.
In line with the demand from Commercial, Residential, Hospitality, Industrial, company have been introduced 1,800+ new shades of internal & External water based emulsions including Anti bacterial, IR Reflection Paints to meet expectations of various customers.
“Our expertise is Special Finishes – Textures / Multicolor paints / Granite Finishes. On Time Delivery with 2000 + in house painters across India. Accommodated by 20 Channel partners. We have 5 manufacturing units located in and around Hyderabad.
Total production capacity is 42000 Metric tons per annum. Now we are in expansion mode. We were setting up a New Facility at Sultanpur Industrial Estate with the capacity of 40,000 MT per annum in 3 Acres of land with Rs.25 Cr Investment ” said Mr.Aakuri Srinivas Reddy, Founder, TECHNO PAINTS.
 “Company is focusing to establish brand position in international market also. We are in discussion with local partners to have a JV in African Market.
Techno paints current Order book is Rs. 250 Cr. We have successfully completed 306 (300 million SFt) projects in south and few other states” said Srinivas Reddy.
Started in 2002, Techno Paints registered Rs.62 Cr turnover in 2018-19. This financial year with 45% growth expecting Rs.85 Cr to 90 Cr.
 Plans to achieve Rs.120 Cr in 2021-22, Rs.250 Cr in 2022 – 2023. Company’s current Man power is 150+ on roll + 1500 skilled & 500 + unskilled labour.
 In coming years Techno paints is planning to recruit more than 200+ employees for different locations & 2000 skilled Painters.
Company Currently catering to Entire South India / Maharashtra / UP / Delhi.
 Plans to expand Pan India very soon. Its Focus is on Tier -2 cities. Also planning to establish Distributors and dealers in entire south india. Company is developing Industrial Paints (Epoxy / Poly Urethane paints, Metal Primers, Wood Primers and Road Marking paints in a short period.

బోడోల కోసం ఆప‌న్న‌హ‌స్తం

0
Indian PM
Narendra Modi
మోదీ అసోంలో ప‌ర్య‌టించారు. బోడోల‌కు భారీగా వ‌రాలు కురిపించారు.
సీఎఎ యాక్టు ప్ర‌క‌ట‌న త‌రువాత ప్ర‌ధాని తొలిసారిగా అసోంలో ప్ర‌సంగించ‌టం విశేషం.
బొడోల కోసం ప్ర‌ధాని 15వేల కోట్ల‌ను స్పెష‌ల్ ప్యాకేజీ కింద ప్ర‌క‌టించారు.
PM. Indian PM
NARENDRA MODI

రెబల్ స్టార్ బర్త్‌డే వేడుకలో…సందడిగా

0

రెబల్ స్టార్ కృష్ణం రాజు సోమవారంతో 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో పాటు విలక్షణ పాత్రలు పోషించిన కృష్ణంరాజు అభిమానులకి తన సినిమాల ద్వారా ఎంతో వినోదాన్ని అందించారు. ఆయన బర్త్‌డే వేడుకలని అభిమానులు గ్రాండ్‌గా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిపారు. హైదరాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో జరిగిన ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవితో పాటు మోహన్ బాబు , మంచు లక్ష్మీ, విష్ణు, ప్రభాస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్దనాన్న పెడుతున్న కేక్‌ని తింటున్న సమయంలో క్లిక్‌మనిపించిన ఫోటో సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతుంది.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

అల్లు అరవింద్ కు జాతీయ అవార్డు

1

సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడో తెలిసిన విషయమే. గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూను ఆయన నిర్మించిన సనిమాల ద్వారా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిన అల్లు అరవింద్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘ఇంటరాక్టివ్ ఫోరం ఆన్ ఇండియన్ ఎకనామీ’ సంస్థ వివిధ అంశాల్లో విశిష్ఠ సేవలు అందించిన వారికి ఈ అవార్డులు అందిస్తుంది. ఇటివల ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

ఈమేరకు అరవింద్.. ‘మాజీ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గానూ దక్కిన ఈ అవార్డు ఎంతో విలువైనదన్నారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేసిన దాతలకు, నా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ అవార్డు అంకితం.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

వారణాసిలో ఐఎస్ఐ ఎజెంట్

0

పాకిస్తాన్‌కు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఐఎస్ఐ ( ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ) ఏజెంట్‌ను యూపీ ఉగ్ర నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. సైనిక స్థావరాలతో సాటు సీఆర్పీఎఫ్ స్థావరాలు, ఫోటోలు, వీడియోలను పాక్‌కు పంపినట్లు అధికారులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని రషీద్ అహ్మద్‌గా గుర్తించారు. అయితే అతని పూర్తి వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

చర్యలు తీసుకోలేన ప్పుడు పదవికి రాజీనామా చేయండి – హైకోర్టు

0

 

కాలుష్య నివారణ చర్యలు తీసుకోలేన ప్పుడు పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల్లో కాలుష్య నివారణ చర్యలపై ధర్మాసనం తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది. కూకట్‌పల్లి చెరువు కాలుష్యంపై పత్రికల కథనాన్ని హైకోర్టు సుమోటో గా ప్రజాహితవ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారించింది. కాలుష్యం సమస్య పరి ష్కారానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చిత్తశుద్ధితో పనిచేయాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లా లని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

15 రోజులకోసారి చెరువుల్లో చెత్త తొలగిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కౌంటర్‌లో పేర్కొనడాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ.. ఏ తేదీల్లో తొలగిస్తున్నారో, ఫొటోలు ఎప్పు డు తీశారో వంటి వివరాలు లేకపోవడాన్ని తప్పుపట్టింది. బెంగళూరులోని చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని పలు అంతస్తుల భవనాలను నిర్మించడమే కాకుండా చెరువులోకి రసాయన వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, చిన్న పాటి వర్షానికే కాలుష్య నురగలు జనావాస కాలనీల్లోకి వచ్చాయని హైకోర్టు గుర్తు చేసింది. సమయం ఇస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయ వాది చెప్పారు. కూకట్‌పల్లి చెరువులో బతుకమ్మ సమయంలో పూలను, వినాయక చవితి సందర్భం గా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని, చెరువు లో 15 రోజులకోసారి చెత్త తొలగిస్తున్నామని తెలిపారు. విచారణ వచ్చే నెల 7కి వాయిదా పడింది.

 

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates

టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో అగ్నిప్రమాదం​

0

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా సరోలి ప్రాంతంలోని రఘువీర్‌ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరాయని అధికారులు తెలిపారు. కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపటిలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Please #Share & #Subscribe
Please Visit UIB Media For Live Updates